అలాగే వెన్నను కూడా అధికంగా తీసుకోకూడదని.. వెన్నను అధికంగా తీసుకుంటే కూడా తలనొప్పి తప్పదని వారు చెప్తున్నారు. ఇంకా మసాలా ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పోషకాలున్న ఆహారాలతో పాటు, మంచి నిద్ర, కొద్దిపాటి వ్యాయామం వంటివి తలనొప్పిని దూరం చేస్తాయి.
తలనొప్పి తగ్గాలంటే.. కొద్దిగా రాతి ఉప్పును చేర్చిన పాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి మాయం అవుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి ప్రభావం తగ్గుతుంది. కొబ్బరి నూనె వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను నుదుటిపై 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది.