Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

సెల్వి

బుధవారం, 25 డిశెంబరు 2024 (14:32 IST)
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ నటించిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ "పుష్ప-2" బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 20 రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం, ముఖ్యంగా దాని హిందీ వెర్షన్‌తో అసాధారణ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రం డిసెంబర్ 24 గురువారం, అంటే 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు చేసింది.
 
ఇందులో, హిందీ వెర్షన్ మాత్రమే రూ.11.5 కోట్లు రాబట్టింది. ఇక తెలుగు వెర్షన్, ఇతర భాషా వెర్షన్‌ల కలెక్షన్లు మందగించినప్పటికీ, కలెక్షన్లు స్థిరంగా వున్నాయి. క్రిస్మస్ నుండి నూతన సంవత్సరం వరకు సెలవుల సీజన్‌లో ఈ కలెక్షన్ల ట్రెండ్ కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది ఆదాయాన్ని పెంచుతుందని అంచనా. "పుష్ప-2" భారతదేశంలో రూ.700 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,600 కోట్లు వసూలు చేసి, అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు