దానిమ్మలో శరీరానికి కావలిసిన శక్తినిచ్చే పోషకాలు పుష్కలంగా వున్నాయి. దానిమ్మ పండును రోజు వారీగా అరకప్పు తీసుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చును. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దానిమ్మలో పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ, సి, ఇ లను దానిమ్మ అందజేస్తుంది.
అలాగే హృద్రోగ సమస్యలను దానిమ్మతో అడ్డుకోవచ్చు. దానిమ్మ పండ్లను అరకప్పు తీసుకోవడం ద్వారా చెడు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయని, ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు. అంతేగాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.