రాత్రికానీ, మధ్యాహ్నం పూటగానీ ఆహారం తీసుకున్న తిన్న వెంటనే నిద్రిస్తున్నారా? అయితే పొట్ట పెరిగిపోవడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఆ అలవాటును మానుకోకతప్పదని వారు సూచిస్తున్నారు. ఎక్కువగా తిని వెంటనే నిద్రపోవడం వల్ల పొట్ట పెరిగే అవకాశముందంటున్నారు.
ఇంకా పొట్టతగ్గాలంటే.. బోర్లా పడుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల పొట్టలోని కొవ్వు కరిగిపోతుందంటున్నారు. నిద్రిస్తున్నప్పుడు శ్వాస లోతుగా పీల్చడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాన్ని చేయాలి. నిద్రపోక ముందే నీరు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నాలుగడుగులు నడిచిన తర్వాతే నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.