కివీ పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా చర్మం ముడుతలు పడకుండా ఇందులోని సి-విటమిన్ కొల్లాజెన్‌లా పనిచేస్తూ ఒంటిఛాయను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రలేమితో బాధపడేవాళ్లకి ఈ పండ్లు ఔషధంలా పనిచేస్తాయి.
సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ ఉండే ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడంవల్ల హృద్రోగాలు వచ్చే ప్రమాదం తక్కువని పరిశోధకులు తెలిపారు. పొటాషియం కారణంగా పక్షవాత ప్రమాదం తగ్గడంతోబాటు ఎముక సాంద్రత క్షీణించకుండా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ ఉంటాయి. బీపీ కూడా తగ్గుతుందని చెప్పారు.
ఒక పండు నుంచి 42 క్యాలరీల శక్తితోపాటు, సుమారు 64 మి.గ్రా. సి-విటమిన్, 3 గ్రా. ఎ- విటమిన్, 252 మి.గ్రా. పొటాషియం, 17 మై.గ్రా. ఫోలేట్, 2.1 గ్రా.పీచూ లభ్యమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.