మితంగా ఆహారం తీసుకోండి... ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ ఆహారం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. రోజుకు మనకు 2,200 కేలరీల శక్తి సరిపోతుంది. ఈ మేరకు శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటే మనకు సరిపోతుంది.