ఆ సూప్ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

శనివారం, 30 నవంబరు 2019 (19:17 IST)
మటన్ బోన్ సూప్‌లో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఫుడ్ అలర్జీలను తగ్గించడానికి, జాయింట్స్ బలపడటానికి మరియు సెల్యూలైట్‌ను తగ్గించేందుకు సహాయపడుతాయి. ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. బోన్ సూప్ డయోరియా, మలబద్దకం, మరియు ప్రేగు రంధ్రాలను చొచ్చుకుపోకుండా నయం చేస్తుంది. ఒక కప్పు బోన్ సూప్ తీసుకోవడం వల్ల మలబద్దక సమస్యని నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
 
2. ఇందులో గ్లూకోసమిన్, చోండ్రోటిన్ పల్ఫెట్ మరియు జాయింట్ పెయిన్ నివారించే కొన్ని పదార్థాలు కలిగి ఉన్నాయి. ఇవి జాయింట్స్‌ను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, నొప్పిని కూడా నివారిస్తాయి. బోన్ సూప్ కీళ్ళనొప్పులను నివారిస్తాయి. 
 
3. బోన్ సూప్‌లో గ్లైసిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది బాగా నిద్రపట్టడానికి మరియు ఏకాగ్రత పెంచుకోవడానికి మరియు జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి బాగా సహాయపడుతుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడైంది.
 
4. ఇది డ్యామేజ్ అయిన లివర్ సెల్స్‌ను పునరుత్పత్తి చేస్తుంది మరియు పురుషులలో వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది మరియు ఇది గాయాలను మాన్పుతుంది. అంతేకాకుండా ఇది హార్మోనులను పెంచుతుంది. 
 
5. బోన్ సూప్‌లో ఉండే జెలాటిన్ ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా పెరుగుదలను పెంచుతుంది. ఈ మంచి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది మరియు విటమిన్స్ మరియు మినరల్స్‌ను గ్రహించడానికి అద్బుతంగా సహాయపడుతుంది.
 
6. ఇందులో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం, గోళ్ళు, జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు