మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. బోరున విలపిస్తున్న ఓ తల్లి!! (Video)

ఠాగూర్

సోమవారం, 23 డిశెంబరు 2024 (18:23 IST)
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ ఓ మహిళ ఆరోపిస్తున్నారు. తిరుపతికి చెందిన కౌశిక్ అనే యువకుడు కేన్సర్‌ కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి కేన్సర్ చికిత్స కోసం ఆర్థిక సాయం చేస్తానని గతంలో జూనియర్ ఎన్టీఆర్ మాట ఇచ్చినట్టు సమాచారం. కానీ, ఆ మాటను జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ నిలబెట్టుకోలేదని కౌశిక్ తల్లి సరస్వతి ఆరోపిస్తున్నారు. 
 
ఇదే అంశంపై ఆమె సోమవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, కేన్సర్‌తో బాధపడుతున్న తన కుమారుడు కౌశిక్‌కు వైద్య సాయం చేస్తానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారని, 'దేవర' చిత్ర విడుదల ముందు జూనియర్ ఎన్టీఆర్ తనతోనూ, తన కుమారుడితోనూ వీడియో కాల్‌లో మాట్లాడి వైద్యం కోసం డబ్బులు ఇస్తానని చెప్పారని తెలిపారు. 
 
కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం కౌశిక్‌కు చెన్నైలో అపోలో చికిత్స పూర్తయింది. ప్రభుత్వం రూ.11 లక్షలు, టీటీడీ 40 లక్షల రూపాయల మేరకు ఆర్థిక సాయం చేసింది. ఇంకా రూ.20 లక్షలను ఆస్పత్రికి చెల్లించాల్సి వుంది. ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తుందని ఆమె బోరున విలపిస్తూ చెప్పారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు మాకు పైసా కూడా ఇవ్వలేదని ఆమె వాపోయారు. 


 

రిపోర్టర్ : ఎన్టీఆర్ గారు ఏమి సహాయం చేయలేదా?

కౌశిక్ అమ్మ: ఎన్టీఆర్ గారు ఫోన్ లో మాత్రమే మాట్లాడరు... నేను చూసుకుంటా అని అన్నారు గాని ఇప్పటివరకు ఏమి చేయలేదు...#JrNTR pic.twitter.com/dmPmJMomWF

— greatandhra (@greatandhranews) December 23, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు