ఆలివ్ ఆయిల్ వంటకు మాత్రమే కాకుండా చర్మసంరక్షణకు, కేశ సంరక్షణకు కూడా వాడుతుంటారు. ఈ ఆయిల్‌ను బేబి ఆయిల్గా పిలుస్తుంటారు. చిన్న పిల్లలకు ఆలివ్ ఆయిల్‌తో మర్ధన చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. ప్రతి రోజు స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ ఆయిల్‌ను వంటలలో విరివిగా ఉపయోగిస్తుంటారు.
ఆలివ్ ఆయిల్లో కొంచెం ఓట్స్ కలిపి చర్మానికి పట్టిస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం కొత్త జీవం పుంజుకుంటుంది. జుట్టు రాలే సమస్య ఉంటే ఆలివ్‌నూనె కొబ్బరి నూనె, సమపాళ్ళలో తీసుకుని తలస్నానం చేయడానికి ముందు తలకు బాగా పట్టించి తర్వాత తలస్నానం చేయాలి. మోచేతులకు, కాళ్ళకు ఆలివ్‌నూనె రాసి మర్దన చేస్తే మృదువుగా మారుతుంది. వంటల్లో అలాగే స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ ఉపయోగించిన వారికి గుండె జబ్బులు రావడం తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
అంతేకాక ఆలివ్ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి రాసుకుంటే ముఖంలో నిగారింపు వస్తుంది. చర్మం పొడిబారినట్లయితే ఆలివ్ ఆయిల్‌తో కొంచెం పెరుగు, నిమ్మరసం కలిపి చర్మానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మంలో తేమ ఏర్పడుతుంది. ఆలివ్‌ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తుంటే, గోళ్ళు, ధృడంగాను అందంగాను మారుతుంది. చలికాలంలో ఆలివ్‌ఆయిల్‌ను పెదాలకు, ముఖానికి రాస్తుంటే పొడిబారకుండా ఉంటుంది. ఆలివ్‌ఆయిల్‌లో గుడ్డు తెల్లసొనను కలిపి, తలక పట్టించి తలస్నానం చేసినట్లయితే జుట్టు మెరవడమే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది.