నారింజ పండు తింటే బోలెడన్ని ప్రయోజనాలు, ఏంటవి?

శుక్రవారం, 6 అక్టోబరు 2023 (22:27 IST)
నారింజ పండు. ఇది ఎంతో ఆరోగ్యకారిగా ఉపయోగపడటమే కాకుండా, సిట్రిక్ యాసిడ్ కారణంగా కాస్త పులుపు, రుచిని కలిగివుంటుంది. ఈ పండు గురించి తెలుసుకుందాము. ఉబ్బసం సమస్య వున్నవారు నారింజ పండురసంలో ఉప్పు, మిరియాల పొడి కలిపి సేవిస్తే తగ్గిపోతుంది. 
మూత్రంలో మంట ఉన్న వారు కమలారసంలో లేత కొబ్బరి నీటిని కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
 
టీబీ, టైఫాయిడ్‌‌తో బాధపడే వారికి కమలారసం రోగనివారిణిగా ఉపయోగపడుతుంది. కమలా రసాన్ని తాగితే శరీరంలో నిరోధకశక్తిని పెరుగుతుంది. కమలాకాయలు తింటుంటే కాలేయం, గుండె, మూత్రపిండాలు సక్రమంగా పని చేస్తాయి.

దగ్గు, ఆయాసం వున్నవారు గ్లాసుడు కమలారసంలో చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి తాగితే శక్తి వస్తుంది. ఎక్కువగా నారింజ తింటే అతిసారం, వాంతులు, వికారం, గుండెల్లో మంట, ఉబ్బరం, తిమ్మిర్లు, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కలగొచ్చు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు