కాన్సర్‌ను నివారించే మేడిపండ్లు.. రోజూ గ్లాసుడు మేడిపండు జ్యూస్ తీసుకుంటే?

బుధవారం, 16 డిశెంబరు 2015 (13:05 IST)
కాన్సర్ నివారిణి అయిన మేడిపండ్లను అత్తిపండ్లు అని కూడా అంటారు. అద్భుత ప్రయోజనాలతో పాటు వివిధ రకాల క్యాన్సర్‌లను తగ్గించే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. మేడిపండ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి అంతేకాకుండా క్యాన్సర్‌ను కలుగచేసే ముఖ్య కారకలైనట్టి ఫ్రీ రాడికల్‌లకు వ్యతిరేకంగా పోరాడతాయి. ముఖ్యంగా పోస్ట్ మెనోపాజల్ స్త్రీలలో, హార్మోన్ల అసమతుల్యత కారణంగా రొమ్ము క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. కానీ అత్తిపండ్ల ఈ రకమైన క్యాన్సర్ వ్యాధికి గురవకుండా కాపాడతాయని వైద్యులు అంటున్నారు. 
 
మేడిపండ్ల నుండి తీసిన రసం మెదడులో క్యాన్సర్‌కు గురైన కణాలపై శక్తివంతంగా పనిచేస్తుందని నూతన పరిశోధనలలో కనుగొన్నారు. మేడిపండ్ల రసం, క్యాన్సర్‌కు గురైన కణాలలో ప్రవేశపెట్టబడిన తరువాత, క్యాన్సర్ అభివృద్ధి 75 శాతం వరకు నివారించబడిందని పరిశోధనలలో తెలిపారు. అత్తిపండ్ల రసం, కాలేయ క్యాన్సర్ కణాలతో వ్యతిరేకంగా పోరాడుతుందని, అధ్యయనాలలో తేలింది. 
 
మేడిపండ్లలో ఉండే 'ల్యుటేయోలిన్' ఫ్లావనాయిడ్‌లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యలను పెంపొదిస్తాయి. 'ల్యుటేయోలిన్', యాంటీ ఆక్సిడెంట్ చర్యలకు మద్దతుగా నిలిచే సామర్థ్యాన్ని కలిగి ఉండి, ఫ్రీ రాడికల్‌లను తటస్థీకరింపచేస్తాయి. ఇది శక్తివంతంగా పనిచేసి, కాన్సర్ పెరుగుదలను నివారిస్తుంది. 'ల్యుటేయోలిన్', చర్మ క్యాన్సర్‌ను నివారించుటలో కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సో రోజూ ఓ గ్లాసుడు మేడిపండ్ల రసం తీసుకోండి.. క్యాన్సర్‌ను దూరం చేసుకోండి. 

వెబ్దునియా పై చదవండి