పొట్ట కొవ్వు తగ్గాలంటే.. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్‌ను తీసుకోకూడదు. ఇవి బరువును అధికంగా పెంచుతాయి. ఒత్తిడికి లోనుకావద్దు. ఒత్తిడికి లోనైతే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఫలితంగా అధికంగా బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వారు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
రోజూ కనీసం 20 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. నిత్యం చేసే వ్యాయామంలో కొంత సమయం అయినా చాలా కఠినంగా ఉండే వ్యాయామాలను చేస్తే అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.