తొక్కులేని మామిడి పండ్లతో కొలెస్ట్రాల్ తగ్గుతుందా? ఎలా?

శనివారం, 19 మే 2018 (11:03 IST)
తొక్కులేని మామిడి పండ్లను తినడం వల్ల ఒబిసిటీకి నుంచి ఉపశమనం పొందవచ్చును. బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లను తినడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. మామిడి పండు పైనున్న తోలును మాత్రం తీసివేసి దానిలోపల గల గుజ్జును తింటే తప్పకుండా బరువు తగ్గుటకు ఉపయోగపడుతుంది. 
 
మామిడి పండు పైనున్న తోలులో కాంపౌండ్లు అధికంగా ఉండటం ద్వారా తొక్కతో తీసుకోవడం మంచిది కాదు. అదే తోలు తీసుకుని తినడం వలన శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించే ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయని వైద్యులు తెలుపుచున్నారు. మామిడి పండు ఊబకాయం తగ్గేందుకు ఎంతో మేలు చేస్తుంది.
 
మామిడిపండ్లు తినడం వల్ల మరో హెల్త్ బెనిఫిట్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డయోబెటిస్ తో పోరాడుతుంది. క్యాన్సర్ వ్యాధిని నివారించుటకు ఉపయోగపడుతుంది. ఈ పండ్లను తినడం వల్ల వీటిలో ఉండే హై ప్రోటీన్స్ క్రిములతో పోరాడుతాయి. వ్యాధినిరోధక శక్తికి చాలా మంచిది. మామిడిపండ్లలో అల్టిమేట్ విటమిన్ కంటెంట్ కలిగి ఉండటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీనిలో పొటాషియం (156 మిల్లీగ్రాములు - 4 శాతం), మెగ్నిషియం (9 మిల్లీగ్రాముల - 2 శాతం) సమృద్ధిగా ఉండడం వల్ల అధిక రక్తపోటును నియంత్రణలో సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు