రాత్రిపూట పండ్లు తీసుకోవచ్చా.. అల్పాహారంలో 90 శాతం పండ్లు తీసుకుంటే?

శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (14:02 IST)
రాత్రిపూట పండ్లు తీసుకోవచ్చా.. అనే అనుమానం మీకుందా? అయితే ఈ స్టోరీ చదవండి. రోజువారీగా పండ్లు తీసుకునేటప్పుడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మధ్య తీసుకోవడం మంచిదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అదే రాత్రిపూట మాత్రం పండ్లు తీసుకోకూడదని వారు సూచిస్తున్నారు. ప్రతి పండులోనూ ''ఫ్రక్టోజు'' పుష్కలంగా ఉంటుంది. 
 
మనం ఆకలితో ఉన్నప్పుడో.. అలసటగా అనిపించినప్పుడో పండ్లు తీసుకుంటే ఆ ఫ్రక్టోజు శరీరంలోకి వెళ్లి గ్లూకోజుగా మారుతుంది. తక్షణ శక్తినిస్తుంది. కానీ రాత్రుల్లో విశ్రాంతి తీసుకునే సమయాన.. ఈ తక్షణ శక్తి మంచిదికాదు. అందుకే నిద్రకు ఉపక్రమించేందుకు ముందు పండ్లు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పండ్లు తీసుకున్న కనీసం గంట విరామం తర్వాతే మధ్యాహ్న భోజనం చేయాలి. వారాంతాల్లో అల్పాహారానికి బదులుగా 90 శాతం పండ్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. యాపిల్‌, బొప్పాయి వంటి పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. కానీ ఉదయం అల్పాహారంతోకానీ, మధ్యాహ్నం భోజనంతోకానీ పండ్లు తీసుకోవడం మంచిది కాదు. 
 
ఒట్టిగా తీసుకుంటే ఇట్టే అరిగిపోయే పండ్లు.. నిండు భోజనంతో కలిపి తీసుకుంటే అరగకుండా ఇబ్బంది పెడతాయి. గ్యాస్ట్రిక్‌ సమస్యల వంటివాటికి దారితీస్తాయి. సలాడ్ సంగతికి వస్తే.. ఆహారం తిన్నాక సలాడ్‌లో భాగంగా ఓ చిన్న ముక్క తీసుకోవడం ఫర్వాలేదు. కానీ పండంతా తినడం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి