గంటల పాటు కుర్చీలకే అతుక్కుపోతున్నారా? ఆయుష్షు..?

మంగళవారం, 12 నవంబరు 2019 (13:03 IST)
ఎప్పుడూ కూర్చునే వుంటారా? గంటల పాటు కుర్చీలకే అతుక్కుపోతున్నారా? కుర్చీ దొరికితే చాలు గంటలు గంటలు కూర్చుండిపోతున్నారా? అయితే మీ ఆయుష్షు తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం శారీరక శ్రమంటూ లేకపోవడంతో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయేవారికి గుండె జబ్బులు, డయాబెటిస్ తప్పవట.
 
అంతేకాకుండా.. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవాళ్ల ఆయుష్షు కూడా తగ్గిపోతుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. కెనడాలో జరిగిన 45 ఏళ్లకు పైబడిన వాళ్లపై జరిగిన  అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యింది. శారీరక శ్రమ చేసేవాళ్లతో పోల్చితే.. ఒళ్లు కదల్చకుండా అలాగే గంటల తరబడి కూర్చునే వీళ్లకు భయంకరమైన జబ్బులు వ్యాపించాయట. దీంతో వాళ్ల ఆయుప్రమాణం కూడా తగ్గుతుందని వాళ్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు