రెడ్ వైన్ సేవించడం వలన గుండె, వివిధ రకాల క్యాన్సర్‌ల బారిన పడకుండా కాపాడబడుతుందని ఎన్నో పరిశోధనల ద్వారా తెలుసుకున్నాం. కాని మరో పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే దంత సంరక్షణలోను రెడ్ వైన్ చాలా తోడ్పాటునందిస్తుంది. ఈ విషయాన్ని ఇటలీకి చెందిన పేవియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం వెల్లడించింది.