చిట్కాలతో జలుబు మటుమాయం!

** రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్‌ నీటిలో రెండు నిమ్మకాయల రసం పిండి తగినంత పంచదార వేసుకుని త్రాగండి. ఇలా నాలుగు రోజులు సేవిస్తే జలుబు మటుమాయం అవుతుంది.

** అరకప్పు నీటిలో దాల్చిన చెక్క పౌడర్‌ పావు చెంచా కలుపుకుని మరగబెట్టండి. ఇందులో చిటికెడు మిరియాలపొడి, ఒక చెంచా తేనె వేసి రోజూ రెండుమూడు సార్లు త్రాగండి. ఇలా సేవిస్తే జలుబు దూరమౌతుంది.

** అరలీటర్‌ నీటిలో 100 గ్రాముల బెండకాయలు ముక్కలుగా తరిగి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటి ద్వారా వచ్చే ఆవిరిని పీల్చండి. జలుబు మటుమాయం అవుతుందంటు్న్నారు వైద్యులు.

** పసుపు కొమ్మును కాల్చి ఆ పొగ పీలిస్తే ముక్కుదిబ్బడ తగ్గుతుంది.

** అరచెంచా మిరియాల పొడి, ఒక చెంచా బెల్లంపొడి కప్పునీటిలో వేసి మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొద్దికొద్దిగా సిప్‌ చేయండి.

** కప్పు వేడి పాలలో అరచెంచా సుద్ధమైన పసుపు కలుపుకుని త్రాగండి. ఇలా ప్రతి రోజూ రెండు మూడుసార్లు త్రాగండి.

వెబ్దునియా పై చదవండి