మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

ఠాగూర్

శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (12:32 IST)
మనమిద్దరం నల్లగా ఉంటే మనకు పుట్టిన బిడ్డ మాత్రం ఇంత తెల్లగా ఎలా పుట్టాడంటూ భార్యను కట్టుకున్న భర్త ప్రశ్నించాడు. దీన్ని అవమానంగా భావించిన భార్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మనస్తాపానికి తోడు అదనపు కట్నం డిమాండ్ కూడా తోడైంది. దీంతో ఆ వివాహిత పుట్టింటికి వెళ్ళి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ భార్యా భర్తలు ఇద్దరూ టెక్కీలు కావడం గమనార్హం. 
 
ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... జగిత్యాలలోని పోచమ్మవాడకు చెందిన లక్ష్మీ ప్రసన్న అనే మహిళకు వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతితో రెండేళ్ళ క్రితం వివాహమైంది. ఇద్దరూ ఉన్నత విద్యావంతులుకావడంతోపాటు బెంగుళూరు నగరంలోని ఐటీ కంపెనీలో టెక్కీలుగా పని చేస్తున్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా గత యేడాది ఒక కుమారుడు జన్మించాడు.
 
అయితే, వీరిద్దరి శరీర రంగులు వేర్వేరుగా ఉండటంతో బిడ్డ తెల్లగా ఉన్నాడు. దీంతో భర్త తిరుపతికి అనుమానం వచ్చింది. మనమిద్దరం ఇలా ఉంటే బాబు ఇంత తెల్లగా ఎలా పుట్టాడు అంటూ భార్య లక్ష్మీప్రసన్నను తరచుగా ప్రశ్నిస్తూ ఆమె శీలాన్ని శంకిస్తూ మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడు. దీనికితోడు అదనపుకట్నం తీసుకునిరావాలంటూ భర్తతో పాటు అత్తమామలు కూడా వేధించడం సాగాడు. దీంతో లక్ష్మీ ప్రసన్న మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు