భర్త- భార్యకు మసాజ్.. భార్య- భర్తకు మసాజ్ మహా మ(త్తు)స్తు!!
WD
రోజంతా చేతినిండా పనితో అలసి సొలసిన భర్త. ఇంట్లో పిల్లలు, ఇంటెడు చాకిరీ చేసి సోలిపోయే భార్య. అలసిన ఇద్దరి మనసులు ఉల్లాసంలో తేలిపోవాలంటే మసాజ్ మంచి ఔషధం అంటున్నారు వైద్యులు.
పని ఒత్తిడితోపాటు ఉన్నట్లుండి మెడ పట్టేయడం, వీపు, నడుము తదితర శరీర భాగాలు ఒక్కోసారి నొప్పి పెట్టడం సాధారణంగా జరుగుతుంటుంది. ఈ సమస్యలను అధిగమించడానికి శరీరాన్ని మసాజ్ చేయించుకోవాలి. బ్యూటీ పార్లర్లకీ, స్పాలకు వెళ్లే తీరిక దొరకదు కనుక భార్యాభర్తలే ఒకరి శరీరాన్ని మరొకరు సుతిమెత్తగా నొక్కుకుంటూ మసాజ్ చేసుకోవాలి.
మసాజ్ టెక్నిక్స్‌ను తెలుసుకుని నైపుణ్యంతో మసాజ్ చేసుకుంటే ఉత్తమ ఫలితముంటుంది. శరీరంలో ఒత్తిడికి గురైన అన్ని భాగాలు మసాజ్ మధురానుభూతిని పొంది రిలాక్స్ అవుతాయి.
ముఖ్యంగా కణతలు, కనుబొమ్మలు, నుదురు, మెడ, భుజాలు, వెన్ను, నడుము, మోకాళ్లలో నిక్షిప్తమై ఉన్న టెన్షన్ అంతా మసాజ్‌తో మాయమై సంతృప్తిని, పునఃశక్తిని అందుకుంటారు.