అరటి పండును పెరుగులో కలిపి తింటే ఏమౌతుంది?

శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (14:43 IST)
బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్ డిశ్చార్జ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అరటి పువ్వును ఉడికించి పెరుగులో కలిపి తీసుకుంటే నెలసరి సమస్యలను.. నెలసరి నొప్పులు, అధిక రక్తస్రావాన్ని తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అరటిపండు డయోరియాను తగ్గిస్తుంది. చెడు బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అరటిలోని కేలరీలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వలను కాపాడుతుంది. విటమిన్ బి6, క్యాల్షియం, జింక్ ఫోలిక్ ఆమ్లం, పీచు వంటివి శరీరానికి బలాన్నిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. 
 
అరటి గుజ్జును ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే రెండు అరటి పండ్లు, ఒక గుడ్డు, గ్లాసు పాలు, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్‌ తయారు చేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు పెరిగి బ‌లంగా త‌యార‌వుతారు. అరటి అజీర్తి, అల్సర్లను దూరం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు