అరికాళ్ళు మృదువుగా ఉండాలంటే.. క్యారెట్ ప్యాక్ వేసుకోండి.

శనివారం, 28 జనవరి 2017 (13:13 IST)
అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి. మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌‌లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.
 
అరికాళ్ళు మృదువుగా ఉండాలంటే.. క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే సరిపోతుంది. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి