డి విటమిన్‌కు దీనికీ పురుషుల్లోని సంతానసాఫల్యతకీ కూడా సంబంధం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. డి విటమిన్ సప్లిమెంట్లను వాడటం ద్వారా స్త్రీపురుషుల్లో సంతాన సాఫల్యత పెరిగిందట. ఈ సప్లిమెంట్ల వాడకం కంటే రోజు ఉదయం సాయంత్రం పూట సూర్యుని ఎండ శరీరంపై పడేలా పావు గంట నిలబడితే అనారోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు పురుషుల్లో, మహిళల్లో సంతాన సాఫల్యత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
సాధారణంగా డి-విటమిన్ సూర్యకాంతి నుంచీ చేపనూనెల నుంచీ లభ్యమవుతుంటుంది. కానీ ఇటీవల చాలామంది కృత్రిమ కాంతిలోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. దాంతో అనేకమందిలో డి-విటమిన్ లోపం తలెత్తుతోంది. ఫలితంగా ఊబకాయం, మధుమేహం, సంతానలేమి వంటి సమస్యలు తప్పట్లేదు. వీటిని దూరం చేసుకోవాలంటే.. సూర్యరశ్మి తప్పకుండా శరీరంపై పడాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.