ప్రతిరోజూ లెమన్ టీ తీసుకుంటే?

గురువారం, 6 సెప్టెంబరు 2018 (09:55 IST)
లెమన్ టీలో గల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. బ్లాక్ టీలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే రక్తప్రసరణను పెంచుటకు ఉపయోగపడుతుంది. ఈ లెమన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, పోషక విలువలు అధికంగా ఉన్నాయి. నిద్రలేమితో బాధపడేవారికి లెమన్ టీ మంచి ఔషధంగా సహాయపడుతుంది.
 
లెమన్ టీలోని పాస్ట్ అనే పదార్థం ప్రాణశక్తిని, జీవక్రియలను, జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచుటకు చక్కగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడేవారు లెమన్ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తద్వారా రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు