స్నాక్స్ సమయంలో నూనె వస్తువులు ఎక్కువ తీసుకోకూడదు. బజ్జీలు, సమోసాలు తీసుకోవడాన్ని చాలామటుకు తగ్గించాలి. పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు, కొబ్బరినీళ్ళు, మధ్యాహ్నం ఆహారంలో గోధుమ రొట్టెలు, అన్నం, పప్పులు, కూరగాయలు, పెరుగు, పండ్లూ లేదా సూప్, రోస్ట్ లేదా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, మాకరోని వంటివి తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
డైటింగ్ అంటే ఆహారనియంత్రణ, వ్యాయామాల సమ్మేళనమే. డైటింగ్ ఎలా చేయాలంటే.. ఉదయం పూట అల్పాహారంగా పాలు ఒక గ్లాసుడు, కార్న్‌ప్లేక్స్, బ్రెడ్డు గుడ్డులోని తెల్లని పదార్థాలు రెండు, పండ్లు, ఇడ్లీ, బిస్కెట్లు, టీ తీసుకోవచ్చు.
అయితే ఫ్రై చేసిన పదార్థాలు, కొవ్వుశాతాలు ఎక్కువగా ఉండే వెన్న, మీగడ, పెరుగు, నెయ్యి, మాంసం, గుడ్డులోని పచ్చసొన, అరటి పండ్లు, సోయాబీన్, పండ్లరసాలు, కృత్రిమంగా తయారైన సూప్‌లు తీసుకోకూడదని న్యూట్రీషన్లు చెబుతున్నారు.