ఉరుకులు పరుగులు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఎన్ని పనులున్నా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
రోజుకు మూడు లీటర్ల నీరు తీసుకుంటే రోగాలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాసుడు నిమ్మకాయ రసాన్ని తీసుకుంటే.. శరీరంలో ఉన్న కొవ్వును తీసేయవచ్చు. ఇక ఒక తులసి ఆకును నమిలితే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇక కప్పు పాలు తీసుకుంటే ఎముకలను దృఢంగా చేసుకోవచ్చు. రోజుకు యాపిల్ తీసుకోవడం ద్వారా డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం ఏమాత్రం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.