వెన్న తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వెన్న తింటే కొవ్వు పెరుగుతుందనీ, బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇందులో విటమిన్ ఎ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను దృఢంగా ఉంచుతుంది.
చిన్నపిల్లలకు రోజూ రెండు స్పూన్ల వెన్న ఇవ్వడం వలన వారి మెదడు, నాడి వ్యవస్థ ఎదుగుదల చాలా మంచిది. చిన్నతనం నుంచి పిల్లలకు తగు మోతాదులో వెన్నను తినడం అలవాటు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పెద్దలు మాత్రం రోజుకో స్పూన్ వెన్నను ఆహారంలో చేర్చుకుంటే హృద్రోగ వ్యాధులు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.