అబ్బా మెడనొప్పి... వదిలించుకునేందుకు చిట్కాలు

శనివారం, 15 సెప్టెంబరు 2018 (12:58 IST)
మెడనొప్పికి రకరకాల కారణాలుంటాయి. ఉదాహరణకు పడుకుని టీవీ చూడటం, ఎక్కువసేపు డెస్క్ వర్క్ లేదా చదవడం- రాయడం, జోరుగా మెడను ఆడించి తిప్పడం, తల దిండు సరిగా లేకపోవడం లాంటివి. మెడనొప్పికి సాధారణంగా ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. మరీ ఎక్కువైతే తప్ప వైద్యుడిని సంప్రదించండి. ఈ నొప్పిని ప్రాథమికంగా చికిత్స చేసుకునేందుకు తగిన సూచనలు మీకోసం...
 
1. మీ మెడను మెల్లగా గడియారంలోని లోలకంలా ఐదుసార్లు తిప్పండి. మళ్ళీ తలను కిందికి పైకి, కుడివైపుకు, ఎడమవైపుకు తిప్పండి. నొప్పిగా ఉంటే నిదానంగా చేయండి. 
 
2. ఏదైనా నూనెను నొప్పి ఉన్న చోట పూయండి. ఆ తర్వాత మాలిష్ చేయండి లేదా సుతిమెత్తగా మాలిష్ చేయించుకోండి. మాలిష్ చేసేటప్పుడు పైనుంచి క్రింది వైపుకు చేయండి. అంటే మెడ పైనుంచి భుజాలవైపుకు మాలిష్ చేస్తుంటే తగ్గిపోతుంది. మాలిష్ చేసిన తర్వాత వేడి నీటితో కాపడం పెట్టండి. కాపడం పెట్టిన తర్వాత చల్లటి వాతావరణంలో తిరగకండి. అలాగే చల్లటి పానీయం త్రాగకండి.
 
3. మీరు టీవీ చూడాలనుకుంటే మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటుండండి. అలాగే చదువుకోవండ, రాయడం, డెస్క్ వర్క్ చేసే సందర్భంలో కాస్త విశ్రాంతి తీసుకుంటుండండి.
 
4. మీరు వాడే తలగడ సరైనదిగా ఉండేలా చూసుకోండి. 
 
5. ఇలా చేసినాకూడా మెడనొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల సలహాలు లేకుండా మెడ నొప్పి నివారణ మాత్రలు వాడకండి. ఇందులో ఫిజియోథెరపిస్ట్ సలహా మేరకు మాత్రమే మెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు