పంటిమీద గార పోగొట్టుకోవడం చాలా ఈజీ...

గురువారం, 20 జులై 2017 (17:36 IST)
చాలామంది దంతాలు గారపట్టి చూడడానికి ఇబ్బందికరంగా కనిపిస్తాయి. పంటిపై గార ఉండటం వల్ల నలుగురిలో హాయిగా నవ్వలేరు కూడా. ఈ గారను తొలగించడానికి చాలామంది డాక్టర్లను కూడా సంప్రదిస్తారు. ఐతే ఇంటివద్దనే పంటిపై ఉన్న మరకలను చాలా సులువుగా తొలగించవచ్చు. 
 
బేకింగ్ సోడా, నిమ్మకాయలతో...  ఒక బౌల్‌లో స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని అందులో నిమ్మకాయ రసాన్ని పిండి రెండింటిని మిశ్రమంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మీ వేలిని గాని టూత్ బ్రష్ ఉపయోగించుకుని దంతాలపై అప్లయ్ చేసి 20 నిమిషాల పాటు అలాగే వదిలి వేయాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేసినట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. త్వరలోనే ఆరోగ్యవంతమైన మిలమిలలాడే దంతాలు మీ సొంతమవుతాయి. 

వెబ్దునియా పై చదవండి