బ్రహ్మి ఆకులు ప్రయోజనాలు

శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:21 IST)
బ్రహ్మి ఆకులు లేదా సరస్వతి ఆకులు. ఆయుర్వేదంలో ఈ మూలికకు ప్రత్యేకమైన స్థానం వుంది. ఈ మూలిక చూర్ణం తీసుకుంటుంటే గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్, స్ట్రోక్, శ్వాసకోశ వ్యాధులు తదితర సమస్యలు దరిచేరవు. బ్రహ్మి చేసే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బ్రహ్మి లేదా సరస్వతి ఆకులు మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తాయి.
 
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వుండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది.
 
మెమరీ బూస్టర్ అని బ్రహ్మికి పేరు. దీన్ని తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
 
నిద్రలేమితో బాధపడేవారు బ్రహ్మిని తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది.
 
రక్తపోటును తగ్గించే గుణం బ్రహ్మికి వుంది. కేశాల ఆరోగ్యానికి బ్రహ్మిని వాడుతుంటారు.
 
మధుమేహం చికిత్సలోనూ సహాయపడుతుంది, గాయాలు మానేందుకు కూడా ఈ ఆకులు ఉపయోగిస్తారు.
 
ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బ్రహ్మి అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని వాడుతుంటే సమస్య క్రమంగా దూరమవుతుంది.
 
గమనిక: చిట్కాలను వాడేముందు ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు