సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునేందుకు ముందు లేదా మధ్యలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిదా కాదా అనే అంశంపై నెదర్లాండ్కు చెందిన ఓ వర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆహారం తీసుకునేటప్పుడు మెదడు, పొట్ట, తినేవారిలో సంతృప్తి భావనల్ని వాస్తవిక రీతిలో పరిశీలించారు.