ప్రతిరోజూ గోంగూరను తీసుకుంటే?

సోమవారం, 13 ఆగస్టు 2018 (10:11 IST)
గోంగూరులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుటలో మంచిగా సహాయపడుతుంది. గోంగూరలో ఐరన్ రక్తహీనతను సమర్థంగా నివారిస్తుంది. అనీమియా వ్యాధిగ్రస్తులకు గోంగూర మంచి ఔషధంగా పనిచేస్తుంది. కంటి సంబంధిత వ్యాధులకు గోంగూరను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
గోంగూరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా రక్తపోటును మెరుగుపరుస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గోంగూరలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోని మెగ్నిషియం మెదడు ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. ఎముకల బలాన్ని పెంచుటకు గోంగూరను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
గోంగూరలో క్యాల్షియం, ఇనుము అధికంగా ఉంటాయి. షుగర్ లెవెల్స్‌ను తగ్గించే శక్తి గోంగూరలో ఉంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారు గోంగూరను తీసుకుంటే చక్కని ఔషధంగా పనిచేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు