దంతపుష్టి కోసం వేరుశెనగ.!

ఆదివారం, 18 డిశెంబరు 2016 (16:27 IST)
వేరుశెనగపప్పులో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటుంది. కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. వేరు శెనగమిక్కిలి బలవర్థకమైన ఆహారం. దీనిలో బి విటమిన్‌ కూడా అధికంగా ఉంటుంది. వేరుశెనగ గింజలను పాలను కూడా కొన్ని ఔషధాలలో ఉపయోగిస్తుంటారు.
 
పాలలో వేయించిన వేరు శెనగపప్పు, బెల్లం కలిపి పిల్లలకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఆహారంగా ఇస్తుంటే మంచి టానిక్కులుగా పనిచేస్తాయి. పచ్చివేరుశెనగ పప్పులో కొంచెం ఉప్పు కలిపి తింటుంటే పండ్లు గట్టిపడడమే కాకుండా దంతాలపైన ఉండే ఎనామిల్‌ను కాపాడుతుంది.
 
లావుగా ఉండేవారు ఆహారానికి ఒక గంట ముందుగా గుప్పుడు వేరుశెనగపప్పులు తిని ఒక కప్పు కాఫీ గానీ టీ గానీ త్రాగితే ఆకలి మందగిస్తుంది. ఈవిధంగా ప్రతిరోజూ చేస్తుంటే కొద్దికాలంలో శరీర బరువు తగ్గిపోతుంది. జీర్ణశక్తి సరిగా లేని వారు పచ్చకామెర్లు వ్యాధి గల వారు వేరుశెనగపప్పును వైద్య సలహాలేకుండా తినకూడదు. గుండెజబ్బులవారు ఎక్కువ రక్తపోటు ఉన్నవారు వేరుశెనగలను ఎక్కువగా వాడరాదు. 

వెబ్దునియా పై చదవండి