ప్రస్తుతం మన దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు దఫాలుగా హెచ్చరికలు చేస్తోంది. వచ్చే 2050 నాటికి భారత్‌లో 60 కోట్ల మంది మధుమేహ రోగులు ఉంటారని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జీవనశైలిని మార్చుకుని ముందుకుసాగినట్టయితే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. అయితే, ఒకసారి ఈ వ్యాధిబారినపడితే చక్కెర రోగగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న అంశాన్ని తెలుసుకుందాం.
* ముందుగా అన్నం, గోధుమలు, మైదా, చక్కెర నిలిపి వేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
* ప్రతి రోజు రాగిజావలో మజ్జిగ పోసుకొని త్రాగుతుంటే మధుమేహం తగ్గుతుంది.
* 1.5 గంటలు నడక, జాగింగ్ లేదా ఏదైనా శారీరక వ్యాయామం తప్పనిసరి.
మధుమేహ రోగులు తినకూడని ఆహార పదార్థాలు. (బంగాళాదుంపలు, కంద వంటి మూల కూరగాయలు, మామిడి పండ్లు, అరటి కాయ)
తినాల్సినవి (ఆపిల్, నారింజ, స్ట్రాబెర్రీ, జామకాయ, పియర్, కివి, బొప్పాయి)
* అలాగే, చిరు ధాన్యాలు ఒక్కోటి 2 రోజుల చొప్పున తీసుకోవాలి. అంటే ఊదలు, అరికలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు వంటి తినాలి.
* చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకుని ఆరగించవచ్చు. రాత్రి భోజనం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసుకోవాలి.