కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే "నువ్వుల పచ్చడి"

FILE
కావలసిన పదార్థాలు :
నువ్వుల.. 150 గ్రా.
పచ్చిమిర్చి.. 8
చింతపండు.. 50 గ్రా.
వెల్లుల్లి.. 15 రెబ్బలు
ఉప్పు.. తగినంత

తాలింపు కోసం..
ఎండుమిర్చి.. 4
ఆవాలు, జీలకర్ర.. చెరో టీ.
కరివేపాకు.. 20 రెమ్మలు
నూనె.. తగినంత

తయారీ విధానం :
చింతపండుని అరకప్పు నీళ్లలో వేసి 15 నిమిషాలు నానబెట్టాలి. గింజలు తీసేసి గుజ్జులా చేసుకోవాలి. బాణలిలో నువ్వులు వేసి బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి. పచ్చిమిర్చిని నేరుగా గ్యాస్‌మంట లేదా బొగ్గులమీద కాల్చాలి. కాల్చిన మిర్చి, వేయించిన నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు, చింతపండుగుజ్జు అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి.

బాణలిలో నూనె వేసి తాలింపు కోసం చెప్పుకున్న పదార్థాలన్నింటితో తాలింపు చేసి నూరుకున్న మిశ్రమంలో కలిపితే నువ్వుల పచ్చడి తయార్..! ఇది దోశెలు, ఇడ్లీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. నువ్వుల్లో పీచు పదార్థాలు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటును నియంత్రించి, కాలేయాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచటంలో కూడా సహకరిస్తాయి.

వెబ్దునియా పై చదవండి