బాలకృష్ణ సరసన విజయశాంతి!!

ఠాగూర్

గురువారం, 22 మే 2025 (11:20 IST)
ఒకపుడు టాలీవుడ్‌లో బాలకృష్ణ - విజయశాంతి కాంబినేషన్‌లో అనేక హిట్ చిత్రాలు వచ్చాయి. 'కథనాయకుడు' అనే సినిమాతో మొదలైన వీరి ప్రయాణం.. 'ముద్దుల కృష్ణయ్య', 'ముద్దుల మావయ్య' వంటి అనేక గోల్డెన్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అలాగే, 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్‌స్పెక్టర్' వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల వరకు వీరి కాంబినేషన్ కొనసాగింది. వీరిద్దరూ కలిసి దాదాపు 16 సినిమాల్లో నటించారు. తెలుగు చిత్రాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ చివరిసారిగా 1993లో వచ్చిన "నిప్పురవ్వ" చిత్రంలో నటించారు. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమాకు సీక్వెల్‌గా "అఖండ-2" తెరకెక్కుతోంది.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో విజయశాంతి ఓ కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారక ప్రకటన వెలువడాల్సివుంది. ఒకవేళ ఈ వార్తలు నిజమై వీరిద్దరూ మళ్లీ వెండితెరపై కనిపిస్తే మాత్రం అభిమానులకు పండగే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు