బ్రిటన్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై మండిపడిన పాక్ ఐఎస్ఐ
ఉగ్రవాదాన్ని భారత్, ఆప్ఘనిస్థాన్ దేశాలకు పాకిస్థాన్ ఎగుమతి చేస్తోందని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ చేసిన వ్యాఖ్యలపై పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఎస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ షుజా పాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా తాను ఈ వారంలో చేపట్టనున్న బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
ఇటీవల భారత్‌లో పర్యటించిన డేవిడ్ కామెరూన్ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదం ఎగుమతిని పాకిస్థాన్ ఆపాలని గట్టిగా కోరారు. ముఖ్యంగా, భారత్, ఆఫ్ఘానిస్థాన్‌లకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే సంస్థలతో పాక్ సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యాఖ్యలు పాక్ పాలకులకు ఆగ్రహం తెప్పించాయి. ఆ దేశ ఐఎస్ఐ చీఫ్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఉగ్రవాద వ్యతిరేక సహకారంపై జరిగనున్న చర్చల కోసం ఈనెల మొదటి వారంలో చేపట్టనున్న తన బ్రిటన్ ప్రర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.