విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ - బిలావల్ భుట్టో ప్రేమాయణం!
మంగళవారం, 25 సెప్టెంబరు 2012 (14:56 IST)
File
FILE
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, అందగత్తె హీనా రబ్బానీ ఖర్‌పై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు, పాకిస్థాన్ అధినేత అసిఫ్ అలీ జర్దారీ తనయుడు బిలావల్ భుట్టో మనస్సు పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తను బంగ్లాదేశ్ పత్రిక ఒకటి ప్రముఖంగా ప్రచురించింది. వయస్సులో తన కంటే 11 యేళ్లు పెద్దవారైన హీనాను గాఢంగా ప్రేమిస్తున్నాను. తామిద్దరం పాకిస్థాన్‌ను వీడి వెళ్లి, స్విట్జర్లాండ్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్టు బిలావల్ భుట్టో ఆ పత్రికకు చెప్పినట్టు ఆ కథనం సారాంశం.
అంతేకాకుండా, ఈ ప్రేమబంధం వివాహ బంధంగా మార్చుకోవాలని బిలావన్ గట్టిగా భావిస్తున్నాడు. హీనా రబ్బానీ ఖర్‌కు ఇద్దరు పిల్లలకు తల్లి కావడం గమనార్హం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జర్దారీ ఆందోళన చెందుతున్నారు. రబ్బానీని తన తనయుడు వివాహం చేసుకుంటే బిలావల్ రాజకీయ భవిష్యత్‌కు తీవ్ర విఘాతం కలుగుతుందని కలక చెందుతున్నారు. పారిశ్రామికవేత్త ఫిరోజ్ గుల్జర్ అనే ధనవంతుడిని హీనా రబ్బానీ ఖర్ వివాహం చేసుకుంది. వీరిద్దరికి అన్నయా, దినా అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.