సాధారణంగా చిన్నపిల్లలు ఏ చిన్న జంతువును చూసినా, పురుగును చూసినా ఇట్టే భయపడిపోతారు. కానీ, ఈ బుడతడు మాత్రం ఏకంగా మొసళ్ళతో స్నేహం చేస్తాడు. తాబేళ్లపై సేద తీరుతాడు. పాములతో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. ఇంతకీ ఆ బుడతడు పేరేంటో తెలుసా చార్లీ పార్కర్. ఈ బుడ్డోడు ఆస్ట్రేలియన్ యంగెస్ట్ రేంజర్‌గా గుర్తింపును కూడా పొందాడు.
మూడేళ్ల వయసు నుంచే చార్లి పార్కర్ జంతువులతో స్నేహం చేస్తున్నాడు. వాటిని అమితంగా ఇష్టపడతాడు, ప్రేమతో బుజ్జగిస్తాడు. స్నేహితులతో ఆడుకుంటున్నట్లు స్వేచ్ఛగా, ఆనందంగా వాటితో ఆడుకుంటాడు. ఆ జీవులకు అవసరమైన ఆహారాన్ని ప్రేమతో తినిపిస్తాడు. అలసిపోయినప్పుడు అమ్మ ఒడిలో హాయిగా బజ్జున్నట్టు ఆ జంతువుల పైనే పడుకుంటాడు.