ఈ తరహా పోటీ చైనాలోని హునాన్ ప్రాంతంలో జరిగింది. ఒక నిముషంలో అత్యధిక మిరపకాయలు తిని ఏడవకూడదనే నిబంధన పెట్టారు. ఇందుకోసం ముందుగా పోటీదారులు నీటితో నిండిన టబ్‌లో కూర్చోవాలి. ఆ తర్వాత ఆ టబ్‌ను మిరపకాయలతో నింపుతారు. ఇపుడు పోటీదారులు పండు మిరపకాయలను ఏడవకుండా తినాలి. అయితే ఈ పోటీలో విజేతగా నిలిచిన వ్యక్తి ఒక నిముషంలో 15 మిరపకాయలను తినగలిగాడు. ఇతనికి చిలీ కింగ్ పురస్కారాన్ని అందజేశారు.