ఆప్ఘన్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ ఎలాంటి పేలుళ్లు జరుగుతాయో అని ప్రజలు భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఆప్ఘనిస్థాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 15 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉన్న సమయంలో పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదవశాత్తు పేలుళ్లు జరిగాయా లేదంటే, ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారా అనే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.