చైనాలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు బంద్ కానున్నాయి. వీటి స్థానంలో విద్యుత్, గ్యాస్‌తో నడిచే కార్లు రోడ్లపై కనిపించనున్నాయి. ఇదే అంశంపై ఆ దేశ పరిశ్రమలు, ఐటీ శాఖ ఉప మంత్రి క్జిన్ గౌబిన్ మాట్లాడుతూ, దేశంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడి నడిచే కార్ల ఉత్పత్తిని నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఓ పాలసీని రూపొందిస్తున్నామన్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశోధనలు కొనసాగుతాయన్నారు. విచ్చలవిడిగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు, ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం కచ్చితంగా చెప్పలేదు.
సరి-బేసి వంటి విధానాలు అమలు చేస్తూ వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి ఎక్కకుండా చర్యలు తీసుకుంది. అయినా ఆశించిన మేర ఫలితాలు కనిపించకపోవడంతో ఇప్పుడు ఏకంగా పెట్రోల్, డీజిల్ కార్ల ఉత్పత్తిపై నిషేధం విధించాలని ఆలోచిస్తున్నది.