శ్రీలంక సూచన మేరకు ఈ ప్రయాణం వాయిదా పడినట్లు ప్రచారం జరిగినా.. గత వారం యువాన్ వాంగ్ హంబన్‌టొట దిశగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు గుర్తించారు. ఈ నౌక ప్రయాణాన్ని ఎందుకు వాయిదా వేయాలంటూ చైనా అధికారులు లంక అధికారులను ప్రశ్నించడంతో.. వారు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఫలితంగా నౌకకు శనివారం లంక అనుమతి మంజూరు చేసింది.
ఆగస్టు 16-22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. 'యవాన్ వాంగ్-5 విషయంలో మా పొరుగు దేశాలతో భద్రత, సహకారం తమ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తాము. ప్రతి దేశం సార్వభౌమత్వం సమానమే అనే సూత్రానికి అనుగుణంగా అన్ని పక్షాల ప్రయోజనాలు, ఆందోళనను పరిగణనలోకి తీసుకొంటాము' అని శ్రీలంక విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.