అయితే షియామీ, వివో, ఓపో, రియల్‌మీ వంటి చైనా సంస్థల దూకుడుతో, దేశీయ సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్ వంటివి మనుగడకు కష్టపడుతున్నాయి. విడిభాగాలు సహా, ఫోన్ల తయారీకి భారీ ప్లాంట్లు కలిగిన చైనా సంస్థలకు పోటీ ఇవ్వలేక, పలు దేశీయ సంస్థలు కార్యకలాపాలు నిలిపేస్తున్నాయి.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ విపణి అయిన మన దేశంలో, ఈ విభాగాన్ని కోల్పోవాల్సి వస్తే చైనా కంపెనీలు తీవ్రంగా నష్టపోనున్నాయి. దేశీయంగా విక్రయమయ్యే ఈ ఫోన్లలో 80 శాతం వాటా చైనా కంపెనీలదే. చైనా సంస్థల తీరు పారదర్శకంగా లేదని ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల పేర్కొనడం గమనార్హం.