మూడేళ్ల వివాదానికి తెర దించుతూ ఖతర్, సౌదీ అరేబియా ఇరు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ మేరకు ఖతర్, సౌదీ ఎయిర్‌లైన్స్ ట్విటర్ ద్వారా కీలక ప్రకటన చేశాయి.
సోమవారం నుంచి దోహా, రియాద్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. జనవరి 14న జెడ్డా నుంచి ఓ విమాన సర్వీసు, దమ్మాం నుంచి జనవరి 16న మరో విమాన సర్వీసు నడుస్తుందని స్పష్టం చేసింది. అది కూడా బోయింగ్ 777-300, బోయింగ్ 787-8, ఎయిర్‌బస్ ఏ350 వంటి పెద్ద విమానాలు నడిపిస్తామని పేర్కొంది.