క్వీన్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ ఈ రోజు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు అని ప్యాలెస్ అధికారిక ప్రతినిధి తెలిపారు. వారి నివాసమైన విండ్‌సోర్ క్యాస్టెల్‌లో ఆస్థాన వైద్యుడు ఇంజెక్షన్ ద్వారా టీకా ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఇంతకుమించిన సమాచారం వెల్లడికాలేదు.
బ్రిటన్‌లో ఇప్పటి వరకు 1.5 మిలియన్ల మంది టీకాలు వేసుకున్నారు. తొలి విడతలో వృద్ధులు, వారి సంరక్షులు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరోవైపు, బ్రిటన్‌లో కరోనా మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు.
శుక్రవారం 1,325 మంది మృత్యువాత పడ్డారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు 80 వేల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అలాగే, నిన్న 68,053 కొత్త కేసులు వెలుగుచూశాయి.