అమెరికా అధ్యక్షుడి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఆ దేశ ప్రజలే. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక విషయంపై వార్తలోకెక్కుతూనే ఉన్నారు. జాత్యంహకారానికి భారతీయులు బలైపోతున్నా ట్రంప్ మాత్రం తనకు ఏ మాత్రం సంబంధంలేనట్లు వ్యవహరించడం, ఆ తర్వాత ఎన్నో విషయాల్లో డొనాల్ట్ ట్రంప్ వ్యవహారంపై ప్రపంచ దేశాలు మండిపడటం తెలిసిందే. అయితే ప్రస్తుతం డొనాల్ట్ ట్రంప్‌ను విమానాలు ఎక్కొంద్దంటూ కొన్ని విమాన సర్వీసులు దణ్ణం పెడుతున్నాయట. అసలు ఎందుకు డొనాల్ట్ ట్రంప్ విమానాలను ఎక్కద్దంటున్నాయో తెలుసుకుందాం..
ట్రంప్ దెబ్బకు ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎమిరేట్స్‌కు బుకింగ్స్ కరువయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఒరిజినల్ ట్రావెల్ బ్యాన్ అనంతరం తమ బుకింగ్స్ 35 శాతం పడిపోయాయని ఫ్లై ఎమిరేట్స్ విమానయాన సంస్థ అధ్యక్షుడు టిక్ క్లార్క్ చెప్పారు. జనవరి నెలలో ట్రంప్ ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రయాణికులకు అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం విదితమే. అనంతరం ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తాయి.
నిరసనకారులు విమానశ్రయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. అనంతరం మళ్లీ ట్రావెల్ బ్యాన్‌పై కొత్త ఆర్డర్లను ట్రంప్ జారీచేశారు. ఈ సారి ఆరు దేశాలపైనే వేటువేసి, గ్రీన్ కార్డు హోల్డర్స్‌కు ఈ బ్యాన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన వెంటనే ఈ ప్రభావం తమ సంస్థపై పడిందని క్లార్క్ చెప్పారు. గత నెలలో భారతీయుడిపై కాన్సస్‌లో జరిగిన విద్వేషపూరిత దాడి కూడా తమ ఎయిర్‌లైన్స్‌కు దెబ్బకొట్టినట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం బుకింగ్స్ రికవరీ అవుతున్నాయని, కానీ ఆశించని స్థాయిలో లేదన్నారు. యధాతథస్థితికి వస్తాయో లేదో కూడా అనుమానమేనని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ట్రావెల్ బ్యాన్ విధించిన తొలి ఎనిమిది రోజుల్లోనే అమెరికాకు వెళ్లే ప్రయాణికుల శాతం కూడా 6.5 శాతం తగ్గినట్టు ట్రావెల్ కన్సల్టెంట్ ఫార్వర్డ్ కీస్ సోమవారం రిపోర్టు వెలువరించింది. నిషేధ దేశాల ప్రయాణికులను, అమెరికాను కలుపుతూ ప్రయాణించే ప్రధాన విమానసంస్థ ఎమిరేట్సే. దుబాయ్ హబ్ ద్వారా ఇది సేవలు అందిస్తోంది. నిషేధ దేశాలకు, అమెరికాకు ప్రస్తుతం డైరెక్ట్‌గా ఎలాంటి విమానాలు లేవట.