ఉక్రెయిన్‌ను ఆక్రమించేందుకు రష్యా కాల్పులు ఆగట్లేదు. రష్యన్ ఆర్మీ ప్రస్తుతం అపార్ట్‌మెంట్లు, ఇళ్లపై బాంబుల వర్షం కురిపిస్తోంది. బంకర్లపై మిసైళ్లు ప్రయోగిస్తోంది. దీంతో వేలాది మంది ప్రజలు.. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
మరోవైపు.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తిరస్కరిస్తున్నామని రష్యా స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమై 22 రోజులైనా కూడా యుక్రెయిన్‌పై భీకర దాడికి పాల్పడుతోంది రష్యా. సామాన్య ప్రజలే టార్గెట్‌గా బాంబులు, మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. నడి వీధుల్లో ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.