డొనాల్డ్ ట్రంప్ - జెలెన్‌స్కీల ఫోన్ కాల్.. మధ్యలో ఎలాన్ మస్క్.. ఎందుకు?

సెల్వి

శనివారం, 9 నవంబరు 2024 (10:09 IST)
Elon Musk took part in Trump-Zelensky
అమెరికా ఎన్నికల విజయం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నారని ఉక్రెయిన్ సీనియర్ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. "నేను దానిని ధృవీకరిస్తున్నాను," అని వెల్లడించారు. బిలియనీర్ స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ట్రంప్ ప్రచారానికి అత్యంత ఉన్నతమైన మద్దతుదారులలో ఒకరు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ‌తో అధికారిక కాల్ సమయంలో మధ్యలో ఎలెన్ మస్క్ కూడా పాల్గొన్నారనే దానిని బట్టి అమెరికా అధ్యక్షుడితో మస్క్ సన్నిహిత సంబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 
 
డొనాల్డ్ ట్రంప్‌ గెలుపు తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సమయంలో ట్రంప్ మధ్యలో ఫోన్‌ను మస్క్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్‌స్కీతో మాట్లాడమని ఎలెన్ మస్క్‌ను ట్రంప్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో జెలెన్‌స్కీతో మస్క్ కొంతసేపు మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. 
 
అయితే వీరి మధ్య చర్చ ఏం జరిగిందనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇకపోతే.. ట్రంప్‌తో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో.. డొనాల్డ్ కార్యవర్గంలో మస్క్ ప్రభావంతమైన పదవి చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు