అధ్యక్షుడి ఆదేశాలను అమెరికా రాష్ట్రాలు ప్రశ్నించలేవన్న ప్రభుత్వం న్యాయవాదుల వాదనలతో ఫెడరల్ జడ్జి జేమ్స్ రాబర్ట్స్ విభేదిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో న్యాయమూర్తి ట్రంప్ ఆదేశాలను నిలిపివేయటంపై స్టే కోరాలని న్యాయ విభాగం భావిస్తోంది. ఇంకా దీనిపై చట్టబద్ధంగా, న్యాయమార్గంలో వెళ్లాలని ట్రంప్ సూచించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. గత వారం ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ల కారణంగా అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దాదాపు 60,000 వీసాలను అధికారులు రద్దు చేశారు. ఇంకా ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వలసదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ రాష్ట్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.