గోగో గొటబయ... రాజపక్ష సింగపూర్‌ వచ్చారు కానీ ఆయనకు మేం ఆశ్రయం ఇవ్వలేదు

గురువారం, 14 జులై 2022 (19:17 IST)
గోగో గొటబయ అంటూ శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష ఎక్కడ వుంటే అక్కడ నిరసనలు చేస్తూ ఆయనను చుట్టుముడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన మాల్దీవుల నుంచి సింగపూర్ దేశానికి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సింగపూర్ విదేశీ వ్యవహారాల శాక స్పందించింది. గొటబాయ ఇక్కడికి వచ్చారు కానీ ఆయనకు తాము ఆశ్రయం ఇవ్వలేదని స్పష్టం చేసేది. కేవలం ప్రైవేటు ట్రిప్‌గా పరిగణిస్తూ ఆయనకు అనుమతి ఇచ్చామనీ, రాజపక్ష తమను ఆశ్రయం కోరలేదని తెలిపింది.

 
శ్రీలంక దేశాన్ని దివాళా తీసి మాల్దీవులకు పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఎక్కడకు వెళ్లినా నిరసనల సెగ తప్పడం లేదు. ఆయన మాల్దీవుల్లోని మాలేలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, అక్కడ శ్రీలంక జాతీయులు గొటబాయకి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టి తమ నిరసన తెలిపారు. గొటబాయని శ్రీలంకకు వెనక్కి తిప్పి పంపాలంటూ వారు డిమాండ్ చేశారు. 

 
కాగా, రెండు రోజుల క్రితం గొటబాయ తన భార్య, ఇద్దరు బాడీగార్డుతో కలిసి మాల్దీవులకు చేరుకున్న విషయం తెల్సిందే. ఈ విషయం మాలేలని నగరంలోని శ్రీలంక జాతీయులు ఈ నిరసన ప్రదర్శన చేశారు. గొటబాయని శ్రీలంకకు తిప్పి పంపాలంటూ వారు నినాదాలు చేశారు. 

 
మరోవైపు, తమ దేశంలోకి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయని అనుమతించడంపై మాల్దీవ్స్ నేషనల్ పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. శ్రీలంక ప్రజల మనోభావాలను మాల్దీవుల ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఎంఎన్‌పీ నేత దున్యా మౌమూన్ విమర్శలు గుప్పించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరుతూ తీర్మానం ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఈ గొడవంతా ఎందుకంటూ గొటబాయ రాజపక్సె సింగపూర్ వెళ్లిపోయారు. మరి అక్కడ ఏం రచ్చ జరుగుతుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు